Thursday, April 18, 2024

గూగుల్ పే నెంబర్ పంపించు..!! బండ్ల గణేష్ రియల్ హీరో

బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు బండ్లగణేష్. అయితే బండ్ల గణేష్ ఎంతో మందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తనను సహాయం కోరిన ఎంతో మందికి ఇప్పటికే బండ్లగణేష్ అండగా నిలబడ్డారు. తాజాగా బండ్ల గణేష్ ఓ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.

ఆటో ప్రమాదం జరిగి ఆపరేషన్ చేయడం వల్ల ఓ వ్యక్తి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో బండ్ల గణేష్ ను సహాయం చేయాలని కోరాడు. వెంటనే బండ్ల గణేష్ స్పందిస్తూ… గూగుల్ పే నెంబర్ పంపించమని ఆ వ్యక్తిని అడిగాడు. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ సహాయానికి నెటిజన్స్ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఇంటి పేరు కూడా బండ్ల కావటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement