Thursday, April 18, 2024

పవన్ తో సినిమా పై బండ్ల గణేష్ క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలాగే అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్లో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారని ఆ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని బండ్ల గణేష్ ఖండించారు. అవన్నీ పుకార్లేనని అందులో నిజం లేదని…ఒక వేళ సినిమా ఓకే అయితే తానే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇక రమేష్ వర్మ రవితేజ తో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement