Thursday, April 25, 2024

బాలయ్య నుంచి ఆ అప్డేట్ కష్టమేనా ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ రానుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. అలాగే వీటితోపాటు మరికొన్ని అప్డేట్ కూడా రాబోతున్నట్లు ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

అందులో స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. అయితే అందులో గోపీచంద్ సినిమా ఓకే కానీ అనిల్ తో మాత్రం ఇంకా క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. దీని పై ఫుల్ క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement