Friday, April 19, 2024

బాల‌య్య 108అప్ డేట్.. ఫ్యాన్స్ కి పండగే

హీరో బాల‌కృష్ణ త‌న నెక్ట్స్ మూవీని ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. బాల‌య్య‌ కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. బాలయ్య కోసం తన జోనర్ అయిన కామిడీని పూర్తిగా వదిలి పెట్టకుండా, ఓ భారీ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ కలిపి రాసినట్లు అనిల్ రావిపూడి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వయస్సు లో ఉన్నప్పుడు బాలయ్య మంచి పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడట. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా నుంచి తాజాగా బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు రేపు ముహుర్తం ఖరారు అయింది. రేపు ఉదయం 9.36 గంటలకు ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ద్వారా మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement