Thursday, April 18, 2024

మరో యంగ్ డైరెక్టర్ తో బాలయ్య ?

తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రాంగ్ దే వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. అయితే ఇప్పటి వరకు లవ్ స్టోరీలతో మెప్పించిన డైరెక్టర్ ఇప్పుడు యాక్షన్ లోకి దిగబోతున్నాడట. అయితే ఈ యాక్షన్ మూవీ నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ తో ఓ సినిమా చేయడానికి బాలకృష్ణ ఓకే చెప్పాడట. దాంతో నిర్మాణసంస్థ వెంకీ అట్లూరి తో కథను సిద్ధం చేయిస్తున్నారని తెలుస్తోంది.

అదే కనుక నిజమైతే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, శ్రీవాస్ వంటి దర్శకులు లైన్ లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement