Friday, April 19, 2024

అఖండ స్టార్ట్ చేశాడు….బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే హీరోయిన్స్ గా పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.

అయితే తాజాగా జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఖండ టీం సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఒకరోజు ముందుగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ లుక్ లో బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement