Wednesday, March 27, 2024

భగవంత్ కేసరిగా బాల‌కృష్ణ‌.. ఊచ‌కోత షురూ

హీరో నంద‌మూరి బాలకృష్ణ 108వ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, బాలయ్య పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేలలో దిగబడిన ఒక బలమైన ఆయుధాన్ని పైకి లాగుతూ బాలయ్య కనిపిస్తున్నాడు. బలమైన యాక్షన్ సీన్ కి బాలయ్య రెడీ అవుతున్నట్టుగా ఈ పోస్టర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆయన లుక్ ఇంతకుముందు సినిమాలకంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ముఖ్య పాత్ర‌లో హీరోయిన్ శ్రీలీల కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement