Thursday, April 25, 2024

బాలయ్య బర్త్ డే నాడే అధికారిక ప్రకటన ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. గతంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేసింది. దీంతో బాలయ్య తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయమై అభిమానుల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి.

అయితే అనిల్ రావిపూడి తో బాలయ్య తన తర్వాతి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాను బాలయ్య బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం రాలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement