Saturday, April 20, 2024

రజనీకాంత్ రికార్డ్ బ్రేక్ చేసిన బాలకృష్ణ

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో బాలకృష్ణ బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. కాగా ఇటీవల ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ అఖండ టీజర్ ను రిలీజ్ చేసింది.

ఆ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. సౌత్ ఇండియా లో ఇప్పటివరకు 37.8 మిలియన్ వ్యూస్ తో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న రజనీకాంత్ కబాలి టీజర్ రికార్డ్ బ్రేక్ చేస్తూ 38 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఇదే విషయం పై బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement