Thursday, March 28, 2024

స్టార్ హీరోలనే తొక్కేస్తున్న అఖండ

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియా లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్ యాభై మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, సాహో లాంటి పెద్ద చిత్రాలు రికార్డులను కూడా అఖండ అలవోకగా బ్రేక్ చేస్తుంది. ఇక ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజానికి మే 28న ఈ చిత్రం రిలీజ్ కావల్సి ఉండగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement