Wednesday, November 27, 2024

Kavya Kalyanram | గ్లామర్ పాత్ర‌ల‌కు సై అంటున్న బ‌ల‌గం హీరోయిన్ ..

బాల నటిగా గంగోత్రితో పాటు పలు సినిమాల్లో నటించి ముద్దుగా మాట్లాడుతూ, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించిన కావ్య కళ్యాణ్‌రామ్‌ ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తోంది. 2022లో టాలీవుడ్‌లో మసూద సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కావ్యకి అనుకోని అదృష్టం అన్నట్లుగా బలగం సినిమాలో నటించడం, భారీ విజయం దక్కడం జరిగింది.

బలగం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా తెలుగు అమ్మాయి, పైగా చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసింది అనే కారణంతో కావ్య కి తెలుగులో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. అయినా కావ్య తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

బలగం సినిమా హిట్‌ కావడంతో ఆ తర్వాత కొన్ని చిన్న చితకా ఆఫర్లు వచ్చాయి. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. ఇక కావ్య సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

రెగ్యులర్‌ కావ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలతో వైరల్‌ అవుతూ ఉంటుంది. ఈసారి సెల్ఫీ క్లిక్స్‌ ను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. తన అందమైన రూపంను మిర్రర్‌ సెల్ఫీ ద్వారా నెటిజన్స్‌ కి షేర్‌ చేసింది.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వగల కావ్య కళ్యాణ్ రామ్‌ మరోసారి ఈ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. స్కిన్‌ షో పెద్దగా చేయకుండా కాస్త నడుము కనిపించేలా ఈ అమ్మడు చేస్తున్న కవ్వింపులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కావ్య అందంకు ఇంకాస్త ఎక్కువ ఆఫర్లు రావాల్సిందే అని, ఆమె చాలా తక్కువగా ఆఫర్లు పొందుతుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement