Thursday, April 25, 2024

అశోకవనంలో అర్జున కళ్యాణం..

‘ఫలక్‌నుమాదాస్‌’ నుండి ‘పాగల్‌’ వరకు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్న హీరో విశ్వక్‌ సేన్‌. ఆయన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్‌ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్‌ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం. ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్న మేకర్స్‌ సినిమాలో విశ్వక్‌ సేన్‌ అల్లం అర్జున్‌ కుమార్‌ పాత్రలో కనిపిస్తారు.

ఈ వినోదాత్మక కుటుంబకథా చిత్రానికి.. రవి కిరణ్‌ కోలా కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్‌ చింతా దర్శకత్వం వహిస్తున్నరు. జైక్రిష్‌ ఈ సినిమాకు సంగీతం సమకూ రుస్తున్నారు. పవి కె.పవన్‌ సినిమా టోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్‌ ఎడిట ర్‌. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. రుక్సర్‌ థిల్లాన్‌ నాయికగా నటిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement