Friday, March 29, 2024

వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్య ?

ఇటీవల కాలంలో డిజిటల్ రంగానికి ఆదరణ పెరిగింది. ఓటీటీ లలో సినిమాలను వెబ్ సిరీస్ లను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు సినీ అభిమానులు. అయితే ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలు అలాగే స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో ఆర్య ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసిందట. అందులో ఆర్య నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక ప్రముఖ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఇటీవలే ఆర్య నటించిన సార్పట్ట చిత్రం ఘన విజయం సాధించింది. ఇది అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement