Wednesday, March 27, 2024

ర‌వితేజతో ఆడి పాడ‌నున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టిస్తోన్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ న‌టిస్తోంది. ర‌జీషా విజ‌య‌న్, వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌. సామ్ సి.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అన్వేషిజైన్ ఆడి పాడ‌నుంది. సీసా అంటే సాగే ఈ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేసిన‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్ ఈ చిత్రంలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌నుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. హిందీలో అడ‌ల్డ్ సిరీస్‌గా తెరకెక్కిన ‘గంధీ బాత్‌’లో అన్వేషి జైన్ నటించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కాగా హీరోయన్లతో నటింప చేయడం కంటే అన్వేషి జైన్ అయితేనే ఈ పాటకు మరింత క్రేజ్ వస్తుందని చిత్ర యూనిట్ భావించడంతో ఆమె తోనే స్పెషల్ సాంగ్ చేయించారు. కాగా ఈ సినిమాలో స్ట్రిక్ట్‌ గవర్నమెంట్‌ అధికారి పాత్రలో రవితేజ నటించనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement