Wednesday, November 27, 2024

GHAATI | అనుష్క ‘ఘాటీ’ మూవీ గ్లింప్స్ రిలీజ్ !

YouTube video

అనుష్క శెట్టి, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి, ఒక కొత్త ప్రాజెక్ట్ ‘‘ఘాటీ’’ కోసం మరోసారి జతకట్టారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన బ్లాక్‌బస్టర్ వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కలయికలో వస్తున్నది. అనుష్కకు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఇది నాల్గవ సినిమా కావడం విశేషం.

ఇదిలా ఉంటే, ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఘటి సినిమాలోని స్వీటీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు… ఇక‌ తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. గ్లింప్స్ లో అనుష్క క్రూరమైన, శక్తివంతమైన అవతార్‌లో కనిపిస్తున్న‌ది. స్వీటీని బోల్డ్ లుక్‌తో ఆమె పాత్రని సరికొత్తదిగా ప్రజెంట్ చేశారు. దీంతో ఆమె పాత్రపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement