Saturday, April 20, 2024

మరొకసారి నాగార్జునతో అనుష్క ?

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సూపర్ సినిమా తో అనుష్క ను ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ఇక అనుష్క తో కలసి కింగ్ నాగార్జున ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు చేశారు. అయితే అనుష్క ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అదరగొట్టింది. ముఖ్యంగా అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలు అనుష్కకు మంచి పేరును తీసుకువచ్చాయి.

అయితే ఇప్పుడు అనుష్క పదవ సారి నాగ్ తో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో అనుష్క నటించబోతోందట. అయితే ఈ విషయమై అధికారికంగా మాత్రం ప్రకటన ఎక్కడా రాలేదు. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement