Saturday, April 20, 2024

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో పాల్గొన్న.. అనుష్క‌శ‌ర్మ‌

నేటితో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ చివ‌రి రోజు. కాగా ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన కేన్స్‌ 2023 ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చివరి దశకు చేరుకుంది. కాగా బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ పాల్గొని సందడి చేశారు. ఫ్లవర్‌ షేప్‌లో ఉన్న వైట్‌ డ్రెస్‌లో రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. పది రోజుల పాటు అట్టహాసంగా కొనసాగిన ఈ వేడుక నేటితో (27వ తేదీ) ముగియనుంది..ఫ్రాన్స్ వేదికగా 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్ పై హొయలు పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement