Thursday, April 25, 2024

మళ్ళీ బరువు పెరిగిన అనుష్క…ఫొటోస్ వైరల్

తెలుగు సినీ ప్రేక్షకులకు అనుష్క గురించి పరిచయం అవసరం లేదు. అరుంధతి, భాగమతి వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హీరోయిన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి అదరగొట్టిన అనుష్క ఇటీవల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత కొత్త సినిమాని ఇప్పటివరకు ప్రకటించలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం రారా కృష్ణయ్య ఫెమ్ మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడట. ఇక 40 ఏళ్ల అమ్మాయి పాత్రలో అనుష్క పాతికేళ్ల అబ్బాయి పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపించనున్నాడట. ఈ ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమాల్లేక అనుష్క మళ్లీ బరువు పెరిగినట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో అనుష్క చాలా బొద్దుగా కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement