Sunday, November 28, 2021

శంకర్ రామ్ చరణ్ సినిమాపై మరో అప్డేట్!!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా… సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్ ఇస్తున్నారు చిత్రయూనిట్.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ట్రై లాంగువల్ సినిమా గా తెరకెక్కనుందట. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News