Thursday, April 18, 2024

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘ధమ్కీ’పై మరో అప్డేట్

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఫలక్‌నుమా దాస్ తరువాత చేస్తున్న మూవీ ధమ్కి. ఈ యాక్షన్-కామెడీ డ్రామాలో నివేదా పేతురాజ్ జంటగా కనిపించనుంది. కాగా, లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ వారంలోనే ఈ మూవీలోని చివరి పాట షూటింగ్‌ని స్టార్ట్ చేయాలని మేకర్స్ అనుకుంటుంన్నారట. ఆ పాటను 3 రోజుల పాటు హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి కాగానే డబ్బింగ్ పనులు మొదలవుతాయి.

ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ కానుంది. వన్మయే క్రియేషన్స్ అండ్ విశ్వక్సేన్ సినిమాస్ నిర్మించిన ఈ బహుభాషా చిత్రంలో రావు రమేష్, అజయ్, రోహిణి, అక్షర గౌడ, పృధ్వీరాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement