Friday, March 29, 2024

మహేష్ రాజమౌళి సినిమాపై మరో అప్డేట్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడని వార్తలు ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు కార్య రూపం మాత్రం దాల్చలేదు. ఈ కాంబినేషన్ పై ఎన్నో వార్త ఇప్పుడు బయటకు వచ్చాయి.

ఈ సినిమా మొత్తం అంతా ఆఫ్రికన్ అడవుల్లో ఉంటుందని ఆ నేపథ్యంలో ఒక ఫారెస్ట్ డ్రామాగా ఉంటుందని అన్నారు. అయితే అదంతా రూమర్ అని అసలు ఈ సినిమా స్టోరీ లైన్ తనకు తెలియదని నిర్మాత నారాయణ అన్నారు. ఇంకా ఈ చిత్రం స్క్రిప్టు దశలోనే ఉందని మరో హింట్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా బాక్ డ్రాప్ లో ఎలాంటి నిజం లేదని దీంతో కన్ఫామ్ అయ్యింది. మరి రాజమౌళి మహేష్ తోఎలాంటి సినిమా చేయబోతున్నాడు చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement