Thursday, April 25, 2024

చరణ్ ప్రశాంత్ నీల్ మూవీపై మరో అప్డేట్!!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై ఓ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని సలార్ సినిమా తో పాటు ఎన్టీఆర్ తో కూడా అనౌన్స్ చేసిన సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడట. మరి ఈ బిగ్ ప్రాజెక్టు అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement