Wednesday, April 24, 2024

ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్ !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా గా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ సినిమా విషయంలో ఎన్నో ఏళ్ల నుంచి ఓం రౌత్ రీసెర్చ్ చేశాడట. ఏడు వేల సంవత్సరాల కిందటి ఈ కథకు కావాల్సిన రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో వైపు రామాయణం లోని ఇతర కీలక పాత్ర లకు సంబంధించి కూడా క్యాస్టింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మరి ఆ కీలకపాత్రలో ఎవరెవరు కనిపించబోతున్నారో చూడాలి. ఇక ప్రభాస్ సలార్ తో పాటు రాధే శ్యామ్ సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement