Friday, April 19, 2024

తెలుగులోకి మరో తమిళ స్టార్ హీరో ఎంట్రీ ?

మరో తమిళ స్టార్ హీరో తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య, కార్తీ డైరెక్ట్ గా సినిమా సినిమాలు చేశారు. విజయ్ దళపతి డైరెక్టుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయం పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ధనుష్ తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. అలాగే ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కూడా నటించబోతున్నాడు. గతంలో ధనుష్ డబ్బింగ్ సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement