Thursday, April 25, 2024

ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ @ సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

ఎస్ ఎస్ రాజు దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం…ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. జాంబీ రెడ్డి సినిమా తర్వాత తేజ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా ఈ సినిమాను ఈనెల 30న విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఆనందం మదికే అంటూ సాగే ఈ పాటకు మహతి స్వర సాగర్ సంగీతం అందించగా… సిద్ శ్రీరామ్ పాడారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement