Friday, March 29, 2024

ఫహాద్ పాత్ర పై మరో రూమర్ !!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజు గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఫహాద్ పాత్రకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అదికూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పాత్రట. అయితే పుష్ప సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఫహాద్ పాత్ర మాత్రం మొదటి పార్ట్ కే పరిమితం అవుతుందట. క్లైమాక్స్ లో అతని క్యారెక్టర్ చనిపోతుందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement