Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మదిలో మరో ప్రశ్న !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా పై మొన్నటివరకు ఆసక్తికర చర్చ నెలకొంది. మొదట త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు అంటూ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ తో చేయబోతున్నాడని అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎవరితో అనేది లో మరో ప్రశ్న ఫ్యాన్స్ లో మెదిలింది. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాని అనౌన్స్ చేశాడు. కానీ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందా అనేది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమాని ప్లాన్ చేసాడు. ఈ రెండింటిలో ఏ సినిమాని మొదట ఎన్టీఆర్ చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement