Tuesday, November 12, 2024

18 పేజెస్….ఇంట్రెస్టింగ్

సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 18 పేజెస్. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. అలాగే బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా జూన్ 1 నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే సినిమా పై మరింత ఆసక్తిని రేపేందుకు రోజుకో పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మొన్న ఓ వైపు చేతిలో సెల్ ఫోన్. మరో వైపు ఓ వ్యక్తి పేజీలో రాసి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా… తాజాగా నిఖిల్ సిగరెట్ కాలుస్తూ… కాగితం తగలబెడుతున్న లుక్ రిలీజ్ చేశారు. దీనిపై కూడా జూన్ 1న ఫస్ట్ లుక్ అని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement