Friday, March 29, 2024

పవన్ ఖాతాలో మరో రికార్డు…. ఇది కూడా ఆయనకే సొంతం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. కరోనా నిబంధనల నేపథ్యంలో అతి తక్కువ మంది అభిమానులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో చాలామంది ఇళ్ల కే పరిమితమయ్యారు. కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ లో ప్రచారమైంది.

అయితే యూట్యూబ్ ఛానల్ లో ఏకకాలంలో 1,31,138 మంది లైవ్ లో చూశారు. కాగా ఇప్పటివరకు ఏ ఒక్క లైవ్ ఈవెంట్ ని కూడా ఒకేసారి లైవ్ లో ఇంత మంది చూసింది లేదట. ఈ సరికొత్త రికార్డు కూడా పవన్ కళ్యాణ్ కే చెందుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా… నివేద థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement