Thursday, April 18, 2024

అక్కినేని కుర్రోడి బర్త్ డే స్పెషల్….సరి కొత్త లుక్ లో అఖిల్

అక్కినేని నాగార్జున వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు అక్కినేని అఖిల్. కెరీర్ ప్రారంభించి చాలా ఏళ్ల అవుతున్నా సరైన హిట్ ని మాత్రం కొట్టలేకపోయారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు చేశాడు అఖిల్. ఈ మూడు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అవుతున్నాయి. అభిమానులు కూడా అందు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించి పాటలు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ ఎంతో స్టైలిష్ గా నవ్వుతూ ఈ పోస్టర్ లో కనిపించారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది ఇప్పటికే ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగుందంటూ అభిమానులు సైతం మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్.కాగా ఈ సినిమాకు సంబంధించి రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement