Friday, December 6, 2024

క్రిష్ సిరీస్‌లో మ‌రో మూవీ.. హృతిక్ మూవీస్ కంప్లీట్ కాగానే క్రిష్ 4..!

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన.. గాడ్ ఆఫ్ గ్రీక్ గా పిలువ‌బ‌డే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. ‘క్రిష్’ మూవీ సిరీస్ తో ఇండియన్ సూపర్ హీరో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పటికే ‘క్రిష్’ సిరీస్‌లో మూడు పార్ట్ లు వచ్చేశాయి. త్వరలోనే ‘క్రిష్-4’ కూడా తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తొంది. ‘క్రిష్-4’ మూవీకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ‘క్రిష్-4’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్నాయని బి టౌన్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌ను కూడా అప్పుడే మొదలుపెట్టబోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం హృతిక్ నటిస్తున్న సినిమాలన్నీ పూర్తి కాగానే ‘క్రిష్-4’ పట్టాలెక్కే చాన్స్ ఉంది.. దీనిపై త్వ‌ర‌లో మూవీ టీమ్ నుంచి ఓ క్లారిటీ రానుంది.

హృతిక్ ప్రస్తుతం ‘విక్రమ్ వేద’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. పుష్కర్, గాయత్రి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం పూర్తికాగానే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ‘ఫైటర్’ లో నటించనున్నాడు. ఈ ప్రాజెక్టులన్ని పూర్తి కాగానే ‘క్రిష్-4’ను మొదలుపడతార‌ని స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement