Tuesday, April 23, 2024

చరణ్ పాత్ర పై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్!!

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. శంకర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ సినిమాలో చరణ్ ను శంకర్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇది ఓ మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని… కానీ రామ్ చరణ్ మాత్రం పొలిటికల్ లీడర్ గా కనిపించడం లేదని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ పాత్ర ఏంటి అనే దానిపై అందరిలోనూ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement