Sunday, July 25, 2021

సెప్టెంబర్ లో ప్రభాస్ నుంచి మరో భారీ అనౌన్స్మెంట్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి అనౌన్స్ మెంట్ తోనే ప్రభాస్ లెవెల్ అమాంతం పెరిగిపోయింది.

ఇప్పుడు మరో భారీ అనౌన్స్మెంట్ కి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇద్దరి కాంబో కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఓవరాల్ గా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను సెప్టెంబర్ లో రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News