Wednesday, March 27, 2024

రామ్ సరసన మరో హీరోయిన్…అఫీషియల్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు హీరో రామ్. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బై లాంగువల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ప్రతి రోజు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా చిత్ర యూనిట్ ఇప్పుడు మరో అధికారిక అప్డేట్ ఇచ్చారు.

ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా అక్షర గౌడ ని తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇపుడు అధికారికంగానే ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించడంతో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement