Thursday, March 28, 2024

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా వాయిదాపై మరో గాసిప్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు మొదట అనౌన్స్ చేశారు.అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే లైన్ లోకి కొరటాల శివ వచ్చారు. త్రివిక్రమ్ తో సినిమా వాయిదా పడింది. ఎన్టీఆర్ తన సినిమాని కొరటాల శివ తో చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ మధ్య ఏదో గొడవ జరిగిందని కూడా టాక్ బయటకు వచ్చింది. అయితే అసలు కారణం అది కాదట. అనుకున్న స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వలేదని… క్రియేటివ్ డిఫరెన్సెస్ తోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందే తప్ప మరే వ్యక్తిగత విభేదాలు రాలేదని… ఇప్పటికి ఈ ఇద్దరు మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో వారికే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement