Friday, April 26, 2024

నాగ చైతన్య ‘థాంక్యూ’ స్టోరీపై మరో గాసిప్

హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నాగచైతన్య తన తర్వాతి సినిమా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

అయితే ఈ సినిమాలో చైతు ఎన్నారైగా నటిస్తున్నాడని తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియా కి రావడం… ఈ జర్నీలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని గతంలో ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో గాసిప్ ఇప్పుడు వినిపిస్తోంది. ఓ మధ్య తరగతి అబ్బాయి ఒక తెలుగు అగ్ర కథానాయకుడి కి పెద్ద అభిమాని. ఆ హీరో కోసం కటౌట్స్ కట్టే స్థాయి నుండి ఒక పెద్ద వ్యాపార వేత్త గా ఎలా మారాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ థ్యాంక్స్ ఎలా చెప్పాడు అనేదే ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement