Thursday, April 25, 2024

మారుతి శర్వానంద్ కాంబినేషన్ లో మరో సినిమా ?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం మహానుభావుడు. ఓవర్ క్లీనింగ్ డిజాస్టర్ తో బాధపడుతున్న వ్యక్తి గా శర్వానంద్ ఇందులో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ ఎలాంటి పద్ధతులు పాటిస్తారో కరోనా సమయంలో అందరూ అవే పద్ధతులను పాటించాల్సి వచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పై కసరత్తులు పూర్తయ్యాయని శర్వానంద్ కూడా మారుతీ స్టొరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మారుతి పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. అలాగే శర్వానంద్ మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement