Thursday, April 25, 2024

టాలీవుడ్‌లో మ‌రో సంక్షోభం.. షూటింగ్స్ నిలిపేయాల‌ని నిర్మాత‌ల నిర్ణ‌యం

టాలీవుడ్‌లో మరో సంక్షోభం నెలకొంది. సినిమా షూటింగులు ఆపేయాల‌ని నిర్మాతలు భావిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌ నిలిపివేసేలా కార్యాచరణ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగు సినీ రంగంపై నిర్మాణ వ్యయం, ఓటీటీల ప్రభావం పడుతోందని నిర్మాతలు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.

థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం కూడా నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement