Wednesday, March 27, 2024

కీర్తి సురేష్ కు మరో బంపర్ ఆఫర్!!

మహానటి సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా విజయ్ దళపతి సినిమా లో కూడా కీర్తి సురేష్ కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా కీర్తి సురేష్ విజయ్ తో నటించింది.

కాగా విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలోనే కీర్తి సురేష్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు సర్కారు వారి పాట అలాగే విజయ్ సినిమా రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం కీర్తి క్రేజ్ మరింత పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement