Thursday, August 5, 2021

ఆడిపురుష్ లో మరో బాలీవుడ్ నటుడు

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. అలాగే సీతగా కృతిసనన్ కనిపించబోతోంది. మరోవైపు రావణాసురుడిగా సైఫ్అలీఖాన్ కనిపించబోతున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా స్టార్ కాస్ట్ జాబితాలో హిందీ బుల్లితెర నటుడు వత్సల్ శేత్ జాయిన్ అయ్యారు. న్యూ బిగినింగ్స్ ఆది పురుష్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనితో దీనితో ఆదిపురుష్ లో ఆయన నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News