Wednesday, April 24, 2024

లైగ‌ర్ నుంచి మ‌రో బిగ్ అప్‌డేట్‌.. అన‌న్య‌, విజ‌య్ రొమాన్స్ మామూలుగా లేదుగా!

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన‌ క్రేజీ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్‌బ్రీడ్). ఈ సినిమా రిలీజ్ కి ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మూవీ ప్ర‌మోష‌న్స్ ని ష్టార్ట్ చేశారు మేక‌ర్స్. అందులో భాగంగానే రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఇటీవ‌లే ఒక బోల్డ్ పిక్ రిలీజ్ చేశాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారింది. ఇక అదే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మూవీ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సాంగ్ ప్రోమో జులై 8న రిలీజ్ కానున్న‌ట్టు ఈ రోజు ఒక అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఇక ఫుల్ సాంగ్ జులై 11న రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండే మంచి పార్టీ మూడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. విజ‌య్ తన చేతితో విజిల్ వేయడానికి అనన్యకి హెల్ప్ చేస్తుంటాడు. విజయ్ రెడ్ క‌ల‌ర్ బ్లేజర్‌లో కనిపిస్తుండగా, అనన్య బ్లాక్ డ్రెస్ లో ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ చూస్తే పబ్ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా కలిసి పాడిన ఈ పాట‌కు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. సాగర్ రాసిన ఈ పాట తమిళ వెర్షన్‌ను సాగర్, వైష్ణవి కొవ్వూరి పాడారు. విష్ణు వర్ధన్, శ్యామ మలయాళంలో ఆల‌పించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్‌కి సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్‌లు ఆలపించారు.

పూరీ కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించింది. పూరి జగన్నాథ్‌, చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌గా ప‌నిచేశారు. కాగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న‌ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement