Thursday, April 25, 2024

అన్నీ మంచి శ‌కున‌ములే నుండి.. సీతాక‌ళ్యాణ వైభోగ‌మే లిరిక‌ల్ వీడియో సాంగ్

శ్రీరామనవమి సందర్భంగా అన్నీ మంచి శ‌కున‌ములే చిత్రం నుండి సీతాక‌ళ్యాణ‌వైభోగ‌మే లిరిక‌ల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఈ చిత్రాన్ని నందినీరెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా సంతోష్‌ శోభన్ నటిస్తున్నారు. మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావురమేశ్‌, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌ మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, అర్జుణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను ఛైత్ర అండిపూడి, శ్రీకృష్ణ పాడారు. ఇప్పటికే విడుదల చేసిన అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement