Thursday, July 29, 2021

ఆర్ఆర్ఆర్…కోసం అనిరుధ్ సాంగ్

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఓ సాంగ్ కోసం ఏకంగా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రంగంలోకి దింపబోతున్నాడట రాజమౌళి. ఈ పాటను అనిరుధ్ పాడటం తో పాటు డ్యాన్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో అనిరుధ్ గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలకు మ్యూజిక్ ని అందించారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పై మంచి అంచనాలు ఉండగా.. ఇప్పుడు అనిరుధ్ ఎంట్రీతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News