Saturday, June 12, 2021

అనిల్ రావిపూడి బాలయ్య సినిమా అప్డేట్ !!

డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఎఫ్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. అయితే అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా నందమూరి బాలకృష్ణ తో తీయబోతున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దాదాపుగా ఈ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఈ బ్యానర్ లో మజిలీ సినిమాను నిర్మించారు. అలాగే టక్ జగదీశ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కాగా మొదటిసారి బాలయ్య తో అనిల్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News