Friday, April 19, 2024

ఫన్ బకెట్ భార్గవ్ కేసుపై యాంకర్ రష్మీ రియాక్షన్

సోషల్ మీడియా లో ఫేమస్ అయిన భార్గవ్ ఇటీవల 14 ఏళ్ల మైనర్ బాలికను మోసం చేసిన విషయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు భార్గవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి ఇదే విషయంపై స్పందించింది. ఓ మహిళ ఇలాంటి ప్రశ్నలు అడగటం చాలా షేమ్ ఫుల్ గా ఉందని… నాలుగు నెలల ప్రెగ్నెన్సీ అయ్యే వరకు మైనర్ బాలిక బయటకు ఎందుకు చెప్పలేదు ? భార్గవ్ మిస్ బిహేవ్ చేసినప్పుడు రిపోర్ట్ ఎందుకు చేయలేదు అని అడగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత మంది తల్లిదండ్రులు ఇండియాలో ప్రెగ్నెన్సీ సెక్స్ గురించి పిల్లలతో మాట్లాడుతున్నారు. తెలుగు సొసైటీ లో ఎంత మంది పేరెంట్స్, టీనేజర్స్ ను సెక్స్ ఎడ్యుకేషన్ డాక్టర్, కౌన్సిలర్ దగ్గరకు తీసుకు వెళ్తున్నారని ప్రశ్నించింది. అసలు ఆ ప్రశ్న అడిగిన మహిళ ఎప్పుడైనా తమ తల్లిదండ్రులతో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిందా అని ప్రశ్నించింది.

కాగా ఈ పోస్ట్ ను రీ పోస్ట్ చేసిన జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సెక్స్ ఎడ్యుకేషన్, పిరియడ్స్, కండోమ్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ పై చర్చ ను నార్మల్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూనే చిన్మయి పై ప్రశంసలు కురిపించారు.

https://www.instagram.com/p/CN-tBEMr714/?igshid=1ixv0z8eude8n

Advertisement

తాజా వార్తలు

Advertisement