Tuesday, April 23, 2024

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం.. ప్రదీప్ తండ్రి కన్నుమూత

బుల్లితెర యాంకర్‌, హీరో ప్రదీప్‌ ఇంట విషాదం నెలకొంది. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతన్న ప్రదీప్‌ తండ్రి పాండురంగ కన్నుమూశారు. శనివారం సాయంత్రం ప్రదీప్‌ తండ్రి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రదీప్‌ కూడా కోవిడ్‌ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా ప్రదీప్‌ తండ్రి కరోనా వల్ల చనిపోయారా లేదా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారన్నది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement