Saturday, April 20, 2024

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ టైటిల్ టీజ‌ర్ – కామెడీ ప‌క్కా అంటోన్న ‘న‌వీన్ పొలిశెట్టి’

యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై వ‌స్తోన్న చిత్రంలో అనుష్క ప‌క్క‌న న‌టించే ఛాన్స్ ని కొట్టేశాడు. కాగా రీసెంట్ గా మ‌రో సినిమాని అనౌన్స్ చేశాడు న‌వీన్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీకి అన‌గ‌న‌గా ఒక రాజు అనే టైటిల్ ని పెట్టారు. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఈ సినిమా మా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ టీజర్ ను.. విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి పెళ్ళికొడుకు గెటప్ లో అందరినీ కనువిందు చేశాడు. మొత్తానికి ఈ టైటిల్ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కామెడీ అదిరిపోద్ద‌నే టాక్ వినిపిస్తోంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement