Saturday, May 8, 2021

‘వరుడు కావలెను’ ఆ సీన్స్ హైలెట్ !!

హిట్ , ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమా లు చేస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం లక్ష్య సినిమాతో పాటు వరుడు కావలెను సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాఫీతో చిత్రయూనిట్ రెడీగా ఉంది. కాగా దానికి సంబంధించిన అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు మధ్య వచ్చే సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయట. కథలోని భావోద్వేగాలకు అనుగుణంగా నటీనటులు కూడా నటించారట. ఇక ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా… వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ ,వెన్నెల కిషోర్ ,ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News