Friday, April 26, 2024

బిడ్డ పుట్టిన తర్వాత ప్రియుడిని వదిలేసిన అమీ జాక్సన్!!

సినీనటి అమీ జాక్సన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు ,విక్రమ్ నటించిన ఐ, అలాగే రజనీకాంత్ నటించిన 2.0 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అమీజాక్సన్. అయితే ఇటీవల ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ అమ్మడు. పెళ్లి కాకుండానే జార్జ్ పనాయొటో అనే వ్యక్తి తో సహజీవనం చేసి బిడ్డను కనింది.

అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అతనికి బ్రేకప్ చెప్పినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ లో జార్జి తో దిగిన ఫోటోలను డిలీట్ చేయడం ఇప్పుడు ఆ వార్తలకు మరింత ఆద్యం పోసినట్లు కనిపిస్తోంది. ప్రియుడితో మనస్పర్థలు వచ్చాయి కాబట్టే ఆయన ఫొటోస్ డిలీట్ చేసిందని… బ్రేకప్ కన్ఫామ్ అయినట్లేనని మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్. మరి ఏం జరిగింది అనేది ఆ ఇద్దరికే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement