Friday, April 26, 2024

అమితాబ్ పెళ్లిరోజు…ఫొటోస్ వైరల్

బాలీవుడ్ స్టార్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కు సినీ రాజకీయ ప్రముఖులు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. శిల్పా శెట్టి, దియా మీర్జా, బిపాసబసు తో పాటు మరి కొంత మంది అమితాబ్ బచ్చన్ కు విషెస్ లు తెలిపారు. అమితాబచ్చన్ 1973 జూన్ 3న వివాహం చేసుకున్నారు. కాగా నేడు అమితా బచ్చన్ 48 వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే అమితాబచ్చన్…. భార్య జయ బచ్చన్ తో కలిసి పెళ్లి లో దిగిన కొన్ని ప్రత్యేక ఫోటోలను షేర్ చేశారు. అలాగే తమకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement